బ్లాక్ మార్కెట్‌కు విత్తనాలు పంపిస్తే లైసెన్స్ రద్దు : సహాయ వ్యవసాయ సంచాలకులు ధనరాజ్

Jun 11,2024 23:08 ##Vetapale #Agriculture

ప్రజాశక్తి – వేటపాలెం
విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని వ్యవసాయ సహాయ సంచాలకులు కె ధనరాజ్ హెచ్చరించారు. మండలంలోని ఎరువుల దుకాణాలను మంగళవారం తనిఖీ చేశారు. లైసెన్సు, స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్స్, ఇన్వాయిస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ గుంటూరు స్పెషల్ కమిషనర్ ఆదేశాల ప్రకారం జిల్లా వ్యసాధికారి సూచన మేరకు 1966 విత్తన చట్టం ప్రకారం జిల్లా ఇంటర్నల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి 100శాతం విత్తన షాప్ లైసెన్సు వెరిఫికేషన్ చేస్తున్నామని అన్నారు. ఇంటర్నల్ స్క్వాడ్‌లో భాగంగా అద్దంకి ప్రాంతానికి చీరల సబ్ డివిజన్‌లో(చీరల, వేటపాలెం, చినగంజం) భాగంగా వేటపాలెం మండల విత్తన యజమానులు సర్టిఫై చేసిన విత్తనాలు, క్వాలిటీ ఉన్న విత్తనాలు అప్రూవల్ ఉన్న కంపెనీ నుంచి తెచ్చి అమ్ముకోవాలని తెలిపారు. కార్యక్రమంలో రాఘవేంద్ర ట్రేడర్స్, గోవర్ధన ఫెర్టీలేజర్, లక్ష్మి శ్రీనివాస ట్రేడర్స్‌, ఎఒ ఐ కాశీవిశ్వనాథ్, విఎఎ జయప్రకాష్ పాల్గొన్నారు.

➡️