సిద్ధం సభ ప్రదేశం పరిశీలన

Feb 24,2024 23:30

ప్రజాశక్తి – మేదరమెట్ల
మార్చి 3న జరగనున్న సిద్ధం మహా సభ ప్రదేశాన్ని రాజ్యసభ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి శనివారం పరిశీలించారు. కొరిసపాడు మండలం పిచ్చుకల గుడిపాడు ప్రాంతంలో సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సిద్ధం మహాసభను జరపనున్నారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి సభా ప్రాంతాన్ని పరిశీలించి తగు సూచనలను చేశారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా జరపాలని సూచించారు. అ్దంకి వైసిపి ఇంచార్జ్ పి హనుమరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సిద్ధం మహాసభ జరపటానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శక్తి వంచన లేకుండా సభ విజయవంతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

➡️