రైతులకు వేల కోట్లు బకాయిపడ్డ జగన్

Feb 10,2024 23:48

ప్రజాశక్తి – వేమూరు
చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు రైతులు, కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పంట రుణాలపై 0 వడ్డీ, పంటల బీమా, దెబ్బతిన్న పంటల నష్టపరిహారం, రైతు భరోసా కేంద్రాల ద్వారా అందాల్సిన అనేక రకాల సౌకర్యాలు రైతులకు అందించకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్‌రెడ్డి ఎప్పుడు బటన్ నొక్కుతాడాని రైతులు ఎదురుచూస్తున్నారని అన్నారు. గత టిడిపి ప్రభుత్వ పాలనలో ఏనాడు రైతులు ఇబ్బందులు పడిన దాఖలాలు లేవని అన్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి నిలువన రైతులను మోసం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో మోదుకూరు, చుండూరు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️