మైనేని మురళీకృష్ణకు సత్కారం

Jun 11,2024 22:54 ##Kolluru #tdpnews

ప్రజాశక్తి – కొల్లూరు
ఎఈఎల్‌సి పట్టణ చర్చి యూత్ ఆధ్వర్యంలో స్థానిక చర్చి సెంటర్ నందు వేమూరు శాసన సభ్యులు నక్క ఆనందబాబు ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఎన్డీఎ కూటమి అఖండ విజయం సాధించి 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తున్న సందర్భంగా మండలంలో అఖండ మెజార్టీ తీసుకొచ్చిన (8059) టిడిపి మండల అధ్యక్షులు మైనేని మురళీకృష్ణను అభినందిస్తూ కేక్ కట్ చేయించారు. శాలువాతో మంగళవారం టౌన్ చర్చి యూత్, మహిళలు సత్కరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు పెదపూడి నాగరాజు, కొమ్ము తులామన్, ఎడ్ల శ్రీనివాస్, బుర్ర జగన్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️