న్యాయవాదులు నిరాహార దీక్షలు

Feb 13,2024 01:13

ప్రజాశక్తి – చీరాల
స్థానిక కోర్టు భవనం వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజ్యా వ్యతిరేక భూహక్కుల చట్టం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యాక్ట్ 27 ఆఫ్ 2023 చట్టంతో అధికార దుర్వినియోగం జరుగుతుందని ఆరోపించారు. లోప భూయిష్టమైన చట్టం ద్వారా పేదవాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. న్యాయస్థాన హక్కులను హరించే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు, న్యాయవాదులు హేమంత్ కుమార్, సాయిబాబు పాల్గొన్నారు.

➡️