ప్రజాశక్తి-చిన్నగంజాం : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా మాచవరపు రవికుమార్ నిమిత్తలయ్యారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యార్థి విభాగంలో స్థానం సంపాదించారు. గతంలో పర్చూరు నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా రాష్ట్ర కార్యదర్శిగా నియమిత్రులయ్యారు చిన్నగంజాం మండలం గొనసపూడి గ్రామానికి చెందిన మాచవరపు రవికుమార్ కు బాపట్ల జిల్లా నుంచి విద్యార్థి విభాగంలో స్థానం దక్కింది. రవికుమార్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, బాపట్ల పార్లమెంటు ఇన్చార్జి నందిగాం సురేష్ కి, పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదే మధుసూదన్ రెడ్డికి, రాష్ట్ర అధ్యక్షులు విద్యార్థి విభాగం పానుగంటి చైతన్యకు ధన్యవాదాలు తెలియజేశారు.
