ఆనందబాబుకు పలువురి అభినందన

Jun 10,2024 00:08 ##Vemuru #tdp #Anandababu

ప్రజాశక్తి – వేమూరు
ఎంఎల్‌ఎ నక్కా ఆనందబాబును కలిసి టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆదివారం అభినందనలు తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగినప్పటి నుండి ప్రతిరోజు ఆనందబాబు క్యాంపు కార్యాలయానికి వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఐలవరం దళితవాడ నుండి వందమందికిపై కార్యాలయానికి వెళ్లి ఆనందబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. కొల్లూరు, వేమురు, అమృతలూరు మండలాల నుండి వందల సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తున్నారు. భోజన విరామ సమయం కూడా ఇవ్వకుండా కార్యకర్తలు ఆనందబాబు కార్యాలయానికి వరుస కడుతున్నారు.

➡️