ప్రజాశక్తి-కొల్లూరు: బాపట్ల జిల్లా కొల్లూరు మండల పరిషత్ మాజీ అధ్యక్షులు, సిపిఎం సీనియర్ నాయకులు అమర్తలూరు కృపానందం మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు కృపానందం భౌతికకాయానికి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి, స్థానిక సిపిఎం నాయకులు నరసింహారావు, తదితరులు పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు.
