వైసిపీ నుండి టిడిపిలోకి భారీ చేరిక

Feb 11,2024 22:30

ప్రజాశక్తి – కర్లపాలెం
వైసిపి అరాచక పాలనలో ప్రజలు, నాయకులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, వైసిపి పాలనకు రానున్న ఎన్నికల యుద్ధంలో తగిన గుణపాఠం చెపుతారని టిడిపి ఇంచార్జి వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో కర్లపాలెంకు చెందిన రెడ్డి, ముస్లిం సామాజిక వర్గాలకు చెందిన 50మంది, పెద్దపులుగు వారిపాలెంకు చెందిన వైసీపీ గ్రామ ఉప సర్పంచ్ నంగు పండు అకమ్మ, 50మంది రెడ్డి వర్గానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలల్లో టిడిపి విజయం సాధిస్తుందని అన్నారు. టిడిపి విధానాలు నచ్చి ఇంతమంది చేరడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు ఏపూరి భూపతిరావు, గొట్టిపాటి శ్రీకృష్ణ, పిట్ల వేణుగోపాలరెడ్డి, నక్కల వెంకటస్వామి, షేక్ బాజి, పిట్ల వసంతరెడ్డి, పఠాన్, భోజీ రాజు, రఫీ, చిలకల సురేంద్ర, కరీముల్లా, సాంబశివరెడ్డి, చలపతిరెడ్డి, గోపి రెడ్డి, సముద్రాల రెడ్డి, వెంకటరెడ్డి, స్వామిరెడ్డి, రామకృష్ణరెడ్డి, పఠాన్ పాల్గొన్నారు.

➡️