టిడిపిలో భారీగా చేరిక

Feb 11,2024 22:58

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని కోనేటిపురం, సూరేపల్లి, తాతావారిపాలెం గ్రామాల నుండి సుమారు 40కుటుంబాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సమక్షంలో టిడిపిలో ఆదివారం చేరారు. ఆనందబాబు వారికి టిడిపి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా అనందబాబు మాట్లాడుతూ రానున్న ఎన్ని కల్లో టిడిపిలో గెలిపే లక్ష్యంగా కలిసి పని చేద్దామని అన్నారు. వైసిపి చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగుచేందని అన్నారు. తాము టిడిపితోనే మనుగడ కొనసాగించేందుకు చేరుతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో భారీ మెజార్టీతో టిడిపి గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. వైసిపి ఆరాచకపాలనకు చరమగీతం పాడి టిడిపి, జనసేన ఉమ్మడి నాయకత్వాన టిడిపి విజయానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ వాకా శేషుబాబు, నాయకులు గోవర్ధనగిరి నవీన్, సుధాకర్, జల్లి కుటుంబరావు, ఎర్రగళ్ల సాంబయ్య, రాయన ప్రసాదరావు పాల్గొన్నారు.

➡️