ఎంఎల్‌ఎ ఏలూరి ప్రచారం

Apr 25,2024 01:05 ##tdp #yeluri

ప్రజాశక్తి – యద్దనపూడి
మండలంలోని యనమదల, అనంతవరం, సూరవరపుపల్లి గ్రామాల్లో స్థానిక ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరైన ఆయనకు స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అంటే టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. యువతకు ఉపాధి దొరకాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు రావిపాటి సీతయ్య, కె నాగేశ్వరరావు, గుదే తారక, సింగు చంద్రం, కోయ సతీష్, శరత్, శ్రీరామ్ మూర్తి, శ్రీను, సుబ్బారావు, వంశీ, రాజశేఖర్, పి బాజీ, అజయ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️