శ్రీశైలం దర్శించుకున్న ఎంఎల్‌ఎ గొట్టిపాటి

Jun 10,2024 23:29 ##Addanki #Gottipati

ప్రజాశక్తి – అద్దంకి
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు పాల్గొన్నారు.

➡️