విద్యార్థులే దేశాభివృద్ధి, సంపద : ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య

Dec 7,2024 11:24 #Bapatla District

ప్రజాశక్తి – చీరాల : నేటి విద్యార్థులే రేపటి దేశ సంపద,అభివృద్ధి అని విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక ఎన్ ఆర్ అండ్ పిఎం హై స్కూల్ ల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంకు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య,చేనేత సహకార సంఘాల సమైక్య చైర్మన్ డాక్టర్ సజ్జా హేమలత లు హజరైయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ పై ప్రత్యేక ద్రుష్టి వహించి వారికీ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను ఉత్తమ ఉపాధ్యాయులచే అందిస్తుంది అన్నారు. విద్యార్థులు అందరు ప్రభుత్వ అందిస్తున్న పదకాలు, వసతులును సద్వినియోగం చేసుకొని అటు చదువులలోని, ఇటు క్రీడలలోను రానిస్తూ తల్లి, దండ్రులు ఆశయాలును నెరవేర్చాలని అన్నారు. కార్యక్రమంలో హెచ్ ఎం సుబ్బారావు,ఎంఈ ఓ 2 శోభా రాణి,విద్యా కమిటీ చైర్మన్ షేక్ షేహనాజ్,టిడిపి పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీను, కౌతవరపు జనార్దన్, మామిడాల శ్రీను, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

➡️