సుపరిపాలనకు శ్రీకారం చుడతా : ఎంఎల్‌ఎ నరేంద్ర వర్మ

ప్రజాశక్తి – బాపట్ల
అవినీతిని అంతమొందించి సుపరిపాలనకు శ్రీకారం చుడతానని ఎంఎల్‌ఎ వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పురపాలక సంఘంలో పాలనను ప్రక్షాళన చేస్తానని అన్నారు. మున్సిపాలిటీలో ప్రధానంగా మురుగు నీటి పారుదల, త్రాగునీటి సమస్య తీర్చేందుకు ప్రధాన్యత ఇస్తామన్నారు. పట్టణంలో త్రాగునీటి పైపుల లీకులతో మంచినీరు కలుషితం కావడం పట్ల పూర్తిస్థాయిలో మరమ్మత్తులు నిర్వహిస్తామని అన్నారు. మున్సిపాలిటీ రాబడి ఖర్చులపై ప్రతినెల సమీక్షిస్తామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉద్యోగులు ప్రశాంతంగా బాధ్యతలు నిర్వర్తించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు పత్రికల ద్వారా తెలియజేసే విధంగా పాలన కొనసాగిస్తామని అన్నారు. బాపట్లను మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతామని అన్నారు. సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ది చేస్తామని అన్నారు. నాలుగు సార్లు బాపట్లలో టీడీపీ పరాజయం పాలైనప్పటికి ఈ సారి గెలవాలనే కసితో కృషి చేసిన టీడీపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖరబాబు, పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, జనసేన అధ్యక్షులు నామన శివన్నారాయణ, ఇనగంటి గాంధీ, ముక్కామల శివ, దయా బాబు, పఠాన్ రాజేష్ పాల్గొన్నారు.

➡️