చంద్రబాబు పరమాణస్వీకారం సందర్భంగా ముగ్గుల పోటీలు

Jun 11,2024 23:02 ##Battiprolu #Chandrababu

ప్రజాశక్తి – భట్టిప్రోలు
రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా మండల సమైక్య ఆధ్వర్యంలో ఎంపీడీఒ, తహశీల్దారు కార్యాలయాల ఆవరణలో డ్వాక్రా మహిళలకు ముగ్గుల పోటీలు మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు తహశీల్దారు ఐ మునిలక్ష్మి, ఎంపిడిఒ మల్లికార్జునరావు, ఎంఈఓ నీలం దేవరాజ్ చేతుల మీదగా బహుమతులు అందజేశారు. కృష్ణా జిల్లా కేసర వద్ద జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి భట్టిప్రోలు మార్కెట్ యార్డు సమీపంలో ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా మహిళలను తరలించనున్నట్లు ఎంపిడిఒ మల్లికార్జునరావు తెలిపారు. సిఎంగా చంద్రబాబు, క్యాబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి మండలం నుండి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎటీఎ శ్రీమన్నారాయణ, ఈఓపిఆర్ అండ్ ఆర్‌డి ఊహారాణి, రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయం, వెలుగు ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు.

➡️