రామోజీరావుకు నందమూరి కళాపరిషత్‌ నివాళి

ప్రజాశక్తి – అద్దంకి
అక్షర యోధుడు రామోజిరావుకు నందమూరి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నివాళి అర్పించారు. నందమూరి కళాపరిషత్‌ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన సభలో రిటైర్డ్ ఆర్జెడి, జానపద కళా పీఠం అధ్యక్షులు ఉబ్బా దేవపాలన మాట్లాడుతూ వేలమంది సైన్యం కంటే పత్రిక పవర్ ఎక్కువని, సంపాదకీయ రంగంలో రాజుగా వెలుగొందిన రామోజీరావు జీవితాన్ని, ఆయన భావాలను చదివితే అర్థమవుతుందని అన్నారు. సంపాదకీయంలోనే కాక సినీ రంగంలో లక్షలాది మందికి ఉపాధినిస్తున్న రామాజీరావు అక్షరం ఉన్నంత కాలం ప్రజల హృదయాల్లో బ్రతికే ఉంటారని అన్నారు. మన్నె రామారావు మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి జీవితంలో ఎన్నో ఒడి దుడుకులు ఎదురైనా నిరాడంబరతో ఎదుర్కొనే వ్యక్తి, సామాజిక హితంగా ముందుకు వెళ్లే వ్యక్తి అని అన్నారు. వ్యవస్థ లోపాలను చీల్చి చెండాడే చండశాసనుడని అన్నారు. అలాంటి వ్యక్తిని మనం మరలా చూడబోమని అన్నారు. కార్యక్రమంలో నాగనేని రామకృష్ణ, జ్యోతి చంద్రమౌళి, అన్నమనేని వెంకటరావు, గాడేపల్లి దివాకరదత్తు, చెన్నుపాటి రామాంజనేయులు, సంధిరెడ్డి శ్రీనివాసరావు, ధూళిపాళ్ల వీరనారాయణ, మలాది శ్రీనివాసరావు, పిసిహెచ్ కోటయ్య, నర్రా గోపాల్, దామా హనుమంతరావు, నాదెండ్ల సుబ్బారావు, ఎస్‌కె మాబు, పిఎస్ఆర్ ఆంజనేయులు, చేబ్రోలు వెంకటసుబ్బయ్య, గోవాడ శ్రీకాంత్, చెన్నుపల్లి నాగేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️