అధికారులు సమన్వయంతో పనిచేయాలి

Jun 11,2024 23:11 ##Santhamaguluru #MPDO

ప్రజాశక్తి – సంతమాగులూరు
రానున్న ప్రభుత్వంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా అమలు చేస్తామని, అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఎంపీడీఒ డి కాశయ్య కోరారు. స్థానిక మండల పరిషత్ సమావేశ హాలులో ఎంపీపీ యనుబర్ల యలమంద అధ్యక్షతన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. సర్పంచులు, ఎంపీటీసీలు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల వివరాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానమిస్తూ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. సమావేశంలో తహశీల్దారు టి ప్రశాంతి, గ్రామ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️