అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి

Jun 10,2024 23:26 ##Nijampatnam #MPP

ప్రజాశక్తి – నిజాంపట్నం
మండలంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ మోపిదేవి విజయ నిర్మల కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సాధారణ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. రేపల్లె ఎంఎల్‌ఎగా హ్యాట్రిక్‌ విజయం సాధించిన అనగాని సత్యప్రసాద్‌కు ఎంపీపీ మోపిదేవి విజయ నిర్మల, వైసీపీ నాయకులు మోపిదేవి హరనాథ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన అభివృద్ధి, ప్రభుత్వ పథకాల ప్రగతి నివేదికలను వివరించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేసినప్పుడే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అందుకు గట్టి కృషి చేయాలని ఎంపీపీ సూచించారు. గ్రామాల్లోని ప్రజల సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. సమావేశంలో గుర్తించిన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంఇఒగా పనిచేస్తున్న కొలసాని హరిబాబు ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా అయనకు ఎంపీపీ మోపిదేవి విజయ నిర్మల, వైసీపీ నాయకులు మోపిదేవి హరనాథ్ బాబు, ఎంపీటీసీ, సర్పంచులు ఘనంగా సత్కరించారు. విద్యా శాఖలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. సమావేశంలో మండల పరిషత్ కార్యాలయం ఎఓ డి రమేష్, వైస్ ఎంపీపీ ఉన్నవ వెంకటేశ్వరరావు (చంటి), ఎంపీటీసీ నాజర్ ఖాన్, అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

➡️