చేతిరాతపై ఒకరోజు శిక్షణ

Feb 10,2024 23:50

ప్రజాశక్తి -భట్టిప్రోలు
మండలంలోని ఐలవరం జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో ఆంగ్ల ఉపాధ్యాయులు పచ్చారు హరికృష్ణ సారధ్యంలో ముచ్చటైన చేతిరాతపై ఒకరోజు శిక్షణ శనివారం నిర్వహించారు. గుడ్ హ్యాండ్ రైటింగ్‌లో అనుభవజ్ఞులైన ఉప్పల రామ్మోహన్‌రావు ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. భట్టిప్రోలుతో పాటు వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై శిక్షణ పొందారు. ఎంఈఓ నీలం దేవరాజు ప్రారంభించారు. ఆణిముత్యాలు లాంటి అక్షరాలను రూపుదిద్దటంలో రామ్మోహనరావు నిష్ణాతులని ఎంఈఓ కొనియాడారు. మంచి హ్యాండ్ రైటింగ్ కలిగి ఉండటం విద్యార్థులకు అనేక విధాలుగా దోహద పడుతుందని అన్నారు. శిక్షణను పాఠశాల హెచ్ఎం మాచర్ల మోహన్ రావు పర్యవేక్షించారు. పాఠశాల పూర్వ విద్యార్థులు శిక్షణ పొందే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించారు.

➡️