విద్యార్ధులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు

Sep 28,2024 00:28 ##Battiprolu #Students #MEO

ప్రజాశక్తి – భట్టిప్రోలు
స్వర్ణాంధ్రప్రదేశ్ -2047 అంశంపై మండల స్థాయి వక్తృత్వ, వ్యాసరచన పోటీలు మండలంలోని వెల్లటూరు జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో నిర్వహించినట్లు హెచ్‌ఎం కె అరుణ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఎంఇఒ దేవరాజు మాట్లాడుతూ విద్యా శాఖ ఆదేశాల మేరకు విద్యార్థుల సలహాలు, సూచనల కోసం ‘స్వర్ణాంధ్ర 2047’ అనే అంశంపై పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని, దేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాసరచన పోటీలో సూరేపల్లి విద్యార్ధిని వి మధు నాగ శ్రీవల్లి, పెసరలంక విద్యార్ధిని ఎస్ మేఘన, వెళ్లటూరు విద్యార్ధిని జి వర్షిణి, వక్తృత్వ పోటీల్లో సూరేపల్లి విద్యార్ధిని ఎస్ నవ్య, వెళ్లటూరు విద్యార్ధిని జి వరిషిణి, సూరేపల్లి విద్యార్ధిని వి మధు నాగ శ్రీవల్లి ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. న్యాయ నిర్ణేతలుగా జి మురళీ మోహన్, కె శివరామకృష్ణ వ్యవహరించారు.

➡️