టీడీపీ, జనసేన కూటమికే ప్రజల మద్దత్తు : జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్

Feb 11,2024 22:46

ప్రజాశక్తి – రేపల్లె
టీడీపీ, జనసేన కూటమికే ప్రజల మద్దత్తు ఉందని జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ అన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని పట్టణంలోని 1వ వార్డులో ఆదివారం నిర్వహించారు. టీడీపీ, జనసేన నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ సిక్స్ కరపత్రాలు పంచుతూ మహాశక్తి పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అరాచక పాలనకు చమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సంక్షేమ పధకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం విద్వాంసం సృష్టించారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి గెలుపును ఎవ్వరు అపలేరని అన్నారు. బటన్ నొక్కి ప్రజలపై పన్నులు వేస్తూన్న సిఎం జగన్‌ను గద్దే దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు జిపి రామారావు, జీవి నాగేశ్వరరావు, వెనిగళ్ల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

➡️