కేర్ స్కూల్ వేదికగా ప్రజాదర్బార్

Jun 10,2024 23:11 ##tdpnews #bapatla #varma

ప్రజాశక్తి బాపట్ల
నియోజకవర్గంలో ఐదేళ్ళుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు వినూత్న రీతిలో ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. మండలంలోని మరుప్రోలువారిపాలెంలోని కేర్ స్కూల్ వేదికగా ప్రజాదర్బార్ నిర్వహిచనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై వినతులు స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలతోపాటు కేర్ సంస్థల అధినేత వేగేశన రాధాకృష్ణ రాజు, బాపట్ల రూరల్ టిడిపి అధ్యక్షులు ముక్కామల శివ, కావూరి శ్రీనివాసరెడ్డి, తాతా జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.

➡️