కూటమి విజయంలో ముస్లిం హక్కుల పరిరక్షణ

Jun 11,2024 22:56 ##Battiprolu #tdpnews #Muslim

ప్రజాశక్తి – భట్టిప్రోలు
టిడిపి కూటమి అత్యధిక సీట్లతో విజయం సాధించడంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తమ వంతు పాత్ర పోషించిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ షబ్లీ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మండల స్థాయిలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు షబ్లికి సత్కరించి అభినందనలు తెలిపారు. సమితి మండల అధ్యక్షులు ఇర్ఫాన్ బేగ్ మాట్లాడుతూ కూటమి ఏర్పడక ముందే ఎంహెచ్‌పిఎస్ తెలుగుదేశంకు అండగా ఉండి టిడిపిని గెలిపిస్తామని ప్రకటించినట్లు గుర్తు చేశారు. అప్పటి అధికార వైసిపి టిడిపి కూటమిపట్ల చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి మైనారిటీ హక్కుల పరిరక్షణ సంఘం సమర్థవంతంగా ఎదుర్కొని కూటమి విజయానికి దోహద పడిందని అన్నారు. కూటమి విషయంలో ముస్లింల పట్ల ఉన్న అపోహలను తొలగించి వారి ఓట్లు కూటమికి చేర్చే విషయంలో షబ్లి తీవ్ర కృషి చేశారని కొనియాడారు. తన కృషికి మండల స్థాయి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు తోడ్పాటు అందించినందుకు షబ్లి అభినందనలు తెలిపారు. సమితి ద్వారా జరిగే సేవా కార్యక్రమాలను ముందుకు కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు సోహెల్, బషీరు, హఫీజుల్ల, అక్బర్ భేగ్ , షేక్ కౌసర్ పాల్గొన్నారు.

➡️