అక్రమ సస్పెన్‌ రద్దు చేయాలని నిరసన

Jun 11,2024 23:12 ##Addanki #APSRTC #SWF

ప్రజాశక్తి – అద్దంకి
ఎపిఎస్ఆర్టీసీ అద్దంకి డిపో ఆవరణలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఎన్నికల నిబంధనల పేరుతో ఆర్టీసీలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ సిహెచ్ సుందరరావును అక్రమంగా సస్పెండ్ చేశారని, ఈ చర్యను నిరసిస్తూ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిపో నందు నిరసన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పి తిరుపతిరెడ్డి, డిపో కార్యదర్శి డిఎవి సుబ్బారావు, డిపో కార్మికులు షేక్ శంషావలి, కె కామేశ్వరరావు, ఎసిహెచ్ అంజయ్య, వైఆర్ కుమార్, బీసీ శేఖర్ పాల్గొన్నారు. ఎస్‌డబ్ల్యుఎఫ్‌ జిల్లా కార్యదర్శి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ సుందరయ్య యూనియన్ నాయకులతో కలసి ఆర్టీసీలోని సమస్యలపై చర్చించారని, అది ఎన్నికల నిబంధనలకు సంబంధం లేకపోయినప్పటికీ సస్పెండ్‌ చేయడం దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు. అక్రమంగా, కక్షపూరితంగా సుందరయ్యను సస్పెండ్ చేశారని అన్నారు. అక్రమ సస్పెన్షన్‌ను రద్దుచేసి బేషారతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

➡️