రాడికల్‌ హ్యూమనిస్ట్‌ సెంటర్‌ వార్షికోత్సవం

Feb 11,2024 22:24

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌
స్థానిక రాడికల్ హ్యూమనిస్టు సెంటర్ 33వ వార్షికోత్సవం రావిపూడి వెంకటాద్రి మీటింగ్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సభకు కరణం రవీంద్ర బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హేతుబద్ధంగా ఆలోచిస్తే మనుషులు తమ సమస్యలు తామే పరిష్కరించుకోగలమని అన్నారు. ఫాసిజం – మానవవాదం అంశంపై షేక్ బాబు, సింహాద్రి యల్లమందారెడ్డి వివరించారు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి నియంతృత్వ బాట పట్టడమే ఫాసిజానికి కారణం అన్నారు. నిత్యజీవితంలో హేతువాదం, మానవవాదాలు అంశంపై షేక్ దరియావలి మాట్లాడారు. విద్యార్ధినీ, విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. వార్షికోత్సవ బహిరంగ సభకు మేడూరి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రాధాకృష్ణ, కరి హరిబాబు, సంగీతరావు, చుంచు శేషయ్య పాల్గొన్నారు.

➡️