అశోక్ బాబు వ్యాఖ్యలకు ఖండన

Feb 11,2024 22:16

ప్రజాశక్తి – భట్టిప్రోలు
స్థానిక రథం సెంటర్లో ఏర్పాటు చేసిన 4వ విడత ఆసరా చెక్కుల పంపిణీలో వైసిపి ఇన్చార్జి వరికుట్టి అశోక బాబు చేసిన వ్యాఖ్యలను టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఖండించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చెక్కుల పంపిణీ ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమాని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి అశోక్‌బాబుకు ఉన్న అర్హత ఏమిటని అన్నారు. డ్వాక్రా వ్యవస్థను సృష్టించింది చంద్రబాబు అన్నారు. డ్వాక్రా అంటే జగన్‌ అనే వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు వై కరుణా శ్రీనివాసరావు, కుక్కల వెంకటేశ్వరరావు, కనపర్తి సుందర్రావు, ఎడ్ల జయశీలరావు, బట్టు మల్లికార్జునరావు, సిరాజుద్దీన్ పాల్గొన్నారు.

➡️