ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన

ప్రజాశక్తి – పంగులూరు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పంగులూరులో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 120 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతరావు, కాలేషా వలి తెలిపారు. వీరిలో 70మందికి శుక్లముల ఆపరేషన్ అవసరమని వైద్యులు గుర్తించారు. స్థానిక రోటరీ భవన్ దగ్గర ఆదివారం నిర్వహించిన వైద్య శిభిరంలో క్యాంపు ఇన్చార్జి చిలుకూరి వీరరాఘవయ్య మాట్లాడుతూ శుక్లముల ఆపరేషన్ల కోసం ఎంపిక చేసిన వారు సోమవారం రోటరీ భవన్ దగ్గరకు వస్తే అక్కడ నుండి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తున్నామని, ఆ బస్సులో వెళ్లి ఆపరేషన్లు చేయించుకుంటే మరల ఇక్కడికి తీసుకు వస్తామని చెప్పారు. రోటరీ క్లబ్ ద్వారా గత 17ఏళ్లుగా వేలాది మంది పేదలకు శుక్లంల ఆపరేషన్ చేయించి కంటి చూపు పొందేటట్లు చేయించామని చెప్పారు. ఈ కంటి పరీక్షలను ఆప్తమాలజీ ఆఫీసర్ ఎల్లారెడ్డి నిర్వహించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు ఇమ్మడిశెట్టి సుబ్బారావు, జాగర్లమూడి సుబ్బారావు (జెకెసి), పోతిన ప్రసాద్ పాల్గొన్నారు.


ముండ్లమూరు : పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి సహకారంతో విజయవాడ ఉన్నం చారిటబుల్ ట్రస్ట్, జిల్లా అంతత్వ నివారణ సంస్థ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం స్థానిక జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో నిర్వహించారు. ఈ శిబిరానికి 620మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకోగా వారిలో 366మందికి శుక్లంల ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు నిర్ణయించారు. శంకర్ కంటి హాస్పిటల్‌లో ఆపరేషన్‌ చేసేందుకు సిఫార్సు చేశారు. హాస్పిటల్‌కు రిఫర్ చేయగా ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేతలు ఉన్నం నరసింహారావు, ఉన్నం రామాంజనేయులు, ఉన్నాం రాము దగ్గరుండి రోగులకు భోజనం ఏర్పాటు చేసి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి ఉచితంగా కంటి అద్దాలను ఇవ్వనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉన్నం నాగేశ్వరరావు. శంకర్ కంటి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

➡️