తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు

Jul 12,2024 23:16 ##Chirala #RDO

ప్రజాశక్తి – చీరాల
స్థానిక పేరాల చిన్నరాధం సెంటర్ నందు ప్రజలకు అందుబాటులో నిత్యవసర వస్తువులు ఏర్పాటు చేసిన కేంద్రంలో తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు విక్రయాలు చేపట్టినట్లు ఆర్డీఒ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. బియ్యం కిలో రూ.49, ముడి బియ్యం కిలో రూ.48, దేశివాలి కందిపప్పు కిలో రూ.160 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. సిఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రైస్, దాల్ మిల్లర్ అసోసియేషన్‌ను లాభాల్లో కొంత తగ్గించుకుని తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు ఇవ్వటం అభినందనీయమని అన్నారు. ఎవరైనా సరే ఆధార్ కార్డు చూపించి బియ్యం, కందిపప్పు కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఎక్కడైనా అక్రమ నిలువలు, కృత్రిమ కొరత సృష్టిస్తే ఉక్కు పాదం మోపుతానని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కౌతరపు జనార్ధనరావు, టిడిపి పట్టణ అధ్యక్షులు గజ్జవల్లి శ్రీనివాసరావు, మాజీ జెడ్‌పిటిసి గుద్ధంటి చంద్రమౌళి, లావేటి శ్రీనివాసతేజ, మొహిద్దిన్, తేలప్రోలు నాగేశ్వరరావు, ఉల్లిపాయల సుబ్బయ్య, మంగపతి, రవీంద్ర, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్ పాల్గొన్నారు.

➡️