ఆర్‌జెడి ఆకస్మిక తనిఖీ

Jun 14,2024 00:25 ##Yaddanapudi #School #RJD

ప్రజాశక్తి – యద్దనపూడి
గుంటూరు ఆర్‌జెడి బి లింగేశ్వరరెడ్డి స్థానిక జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల కిట్ల పంపిణీని పరిశీలించారు. చివరి కిట్టు వరకు త్వరిత గతిన పంపిణీ చేయాలని చూచించారు. ప్రణాళిక ప్రకారం కిట్ల పంపిణీ చేస్తుండటం పట్ల ఎంఇఒ గోపిని అభినందించారు. బోధనలో ఐఎఫ్‌పి ప్యానెళ్లను ఉపయోగించాలని చెప్పారు. అప్పుడు విద్యార్థులు సులువుగా అర్ధం చేసుకుంటారని అన్నారు. కార్యక్రమంలో పర్చూరు డిప్యూటి డిఇఒ నిర్మలాదేవి, హెచ్‌ఎం దేవేంద్రరావు, ప్రాధమిక పాఠశాల హెచ్‌ఎం రావి శ్రీనివాసరావు, జీవన్, మస్తాన్‌వలి, యూసుఫ్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

➡️