పంట కాలువలో ఆర్టీసీ బస్సు బోల్తా

Jul 12,2024 23:15 ##Inkollu #Panguluru #RTCBUS

ప్రజాశక్తి – పంగులూరు
మండలంలోని తూర్పు కొప్పెరపాడు, తూర్పు తక్కెలపాడు గ్రామాల మధ్య ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు శుక్రవారం పంట కాల్వలో బోల్తాపడింది. అద్దంకి డిపోకు చెందిన ఏపీ 29 జెడ్ 1044 నంబరు గల ఆర్టీసీ బస్సు ఇంకొల్లు నుండి అద్దంకి వెళుతూ కాల్వలో బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 19మంది ప్రయాణికులు, కండక్టర్‌ సురేష్‌ ఉన్నారు. ప్రయాణికులంతా ఒక్కసారిగా కేకలు వేస్తూ బస్సు నుండి బయటకు వచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని రేణింగవరం ఎస్‌ఐ కెకె తిరుపతిరావు తెలిపారు.

➡️