చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆర్టీసీ బస్సులు

Jun 11,2024 23:07 ##bapatla #Chandrababu #Rtcbus

ప్రజాశక్తి – బాపట్ల
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ సభకు వెళ్లేందుకు బాపట్ల నుండి విజయవాడకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజా రవాణా జిల్లా అధికారి మంగళవారం తెలిపారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నుండి నాలుగు బస్సులు విజయవాడకు బయలుదేరే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. బుధవారం ఉదయం ఐదు గంటలకే టిడిపి నాయకులు ఎంపిక చేసిన ప్రాంతాలకు బస్సులు చేరుకుంటాయని అన్నారు. ఉదయం 6 గంటలకు ఆయా ప్రాంతాల నుండి బయలుదేరుతాయని తెలిపారు. రేపల్లె, వేమూరు, చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల తోపాటు బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం టిడిపి కార్యాలయాల నుండి ఉదయం 6గంటలకు బస్సులు విజయవాడ బయలు దేరుతాయని తెలిపారు.

➡️