స్కాలర్షిప్ అర్హత పరీక్ష

Feb 11,2024 23:03

ప్రజాశక్తి – అద్దంకి
పట్టణంలోని శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల్లో ఆదివారం పరీక్ష నిర్వహించారు. విద్యోన్నతి ఫౌండేషన్ డైరెక్టర్ ధూళిపాళ్ల వీరనారాయణ మాట్లాడుతూ మండలంలోని 10ఉన్నత పాఠశాలల నుండి 113మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జె పంగులూరు, ఇంకొల్లు మండలాల్లో విద్యార్థులు ఆయా మండలాల్లోనే పరీక్షలు విద్యార్థులకు నిర్వహించారు. 3మండలాలోని 253మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో మండలానికి ఐదుగురు చొప్పున 15మందిని మెరుగైన విద్యార్థులుగా ఎంపిక చేశారు. వారికి 10వ తరగతి, తదుపరి తరగతులకు ఏడాదికి రూ.10వేల చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తామని తెలిపారు. ఆ విధంగా విద్యాయోన్నతి ఫౌండేషన్ ద్వారా ఒక ఏడాదికి రూ.3లక్షల స్కాలర్షిప్‌గా విద్యార్థులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇది రెండో ఏడాది ఇస్తున్నట్లు తెలిపారు. సిండికేట్ బ్యాంకు రిటైర్డ్ మేనేజర్ తాళ్లూరి బాబురావు మాట్లాడుతూ గతంలో బ్యాంకులో పని చేసేటప్పుడు ఎంత విలువలతో ఉన్నారో అలాంటి విలువలతో నేడు విద్యార్థులకు విద్యాసేవ చేయుటకై మంచి తలంపుతో విద్యోన్నతి ఫౌండేషన్ స్థాపించి ఆర్థిక పరమైన సేవ చేయటం గొప్ప విషయమని అన్నారు. ఈ ఎగ్జామ్‌కు చీఫ్‌గా అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు వ్యవహరించారు. ఇన్వెజి లెటర్స్‌గా మలాది శ్రీనివాసరావు, కావూరి ధనలక్ష్మి, ఎన్ తరుణ్, కె రత్తయ్య, బి హనుమంతరావు వ్యవహరించారు.


పంగులూరు : విద్యోన్నతి ఫౌండేషన్ 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించే టాలెంట్ టెస్టు పంగులూరు జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో ఆదివారం నిర్వహించారు. మండలంలోని 10వ తరగతి చదువుతున్న 67 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ డైరెక్టర్ ధూళిపాళ్ల వీరనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి మెరుగైన విద్యార్థులుగా తీర్చిదిద్దటానికి అవసరమైన ఆర్థిక వెసులుబాటు కలిగించడానికి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి మాజీ సర్పంచ్ దూళిపాళ్ల వెంకటేశ్వర్లు, రిటైర్డ్ హెచ్‌ఎం బోడెంపూడి రామ్మూర్తి జ్ఞాపకార్థం ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పంగులూరు, ఇంకొల్లు, అద్దంకి మండలాల్లో విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మండలానికి ఐదుగురు విద్యార్థులను గుర్తించి, మూడు మండలాల్లో 15మంది విద్యార్థులకు ఏడాదికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటర్ లేదా తచ్చమానమైన చదువుకు రెండేళ్ల పాటు ఇస్తామన్నారు. ఒక్కొక్క విద్యార్థికి రెండేళ్లకు రూ.20వేలు అందజేస్తామన్నారు. అద్దంకిలో 113 మంది, ఇంకొల్లులో 76 మంది, పంగులూరులో 64 మంది మొత్తం 253 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. పంగులూరు పరీక్ష కేంద్రంలో టాలెంట్ టెస్ట్ చీఫ్ గా కె వీరాంజనేయులు, వి విజయలక్ష్మి, టి జానకి, విద్యాదాత వడ్డవల్లి వీరనారాయణ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పి ఆదిత్య పాల్గొన్నారు.

➡️