శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి

Feb 13,2024 01:05

ప్రజాశక్తి – చిన్నగంజాం
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పధం పెంపొందించాల్సిన అవసరాన్ని ఉపాధ్యాయులు చెప్పారు. స్థానిక జెడ్‌పి ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి సైన్స్ కళాజాత నిర్వహించారు. జెవివి ఆధ్వర్యంలో ఈనెల 5నుంచి 18వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 2000కిలోమీటర్లు ప్రజల కోసం, ప్రగతి కోసం, పర్యావరణం కోసం, ప్రజాస్వామ్యం కోసం, లౌకికవాదం కోసం సైన్స్ అనే నినాదాలతో మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నట్లు జెవివి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి మురళీధర్ అన్నారు. పాఠశాలల్లో, గ్రామాల్లో మూఢనమ్మకాల్ని పోగొట్టడానికి మ్యాజిక్ షో రూపాల్లో, నాటికలు, పాటల రూపంలో అవగాహన కల్పిస్తున్నట్లు జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు అన్నారు. కార్యక్రమంలో జెవివి మండలం అధ్యక్షులు ఎస్ నరసింహరావు, హెచ్‌ఎం డి రత్నకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️