రైతులే వ్యాపారులుగా మారే అవకాశం : సెర్చ్ ప్రాజెక్ట్ అధికారి దివ్య జ్యోతి

Mar 27,2024 23:51 ##Serch #nabard #former

ప్రజాశక్తి – ఇంకొల్లు
రైతులు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని అందులో సభ్యులుగా, షేర్ హోల్డర్లుగా చేరటం వలన నాబార్డు ద్వారా కలిగే వివిధ ప్రయోజనాలు ఉపయోగించుకోవచ్చని బాపట్లకు చెందిన సెర్చి సేవా సంస్థ లీడ్ ప్రాజెక్టు అధికారి ఎ దివ్యజ్యోతి అన్నారు. స్థానిక శివాలయం వెనుక వీధిలోని ఇంకొల్లు సంరక్షణ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులతో వివిధ కీలక అంశాలు చర్చించారు. రైతులే స్వయంగా వ్యాపారులుగా ఎదిగి వ్యవసాయానికి అవసరమైన క్రిమిసంహారక మందులు, ఎరువులు, యంత్ర పరికరాలు, ఇతర వినియోగ వస్తువుల కొనుగోలు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను అమ్ముకోవడం, కోనడంలో రైతులకు స్వప్రయోజనం కలిగే విధంగా ఈ కేంద్రాలను నా బార్డ్ ఆధ్వర్యంలో సెర్చ్ సంస్థ ద్వారా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రైతుల ఎఫ్ఈసిఎల్ కేంద్రాలకు మూడేళ్లపాటు సెర్చ్‌ సంస్థ మౌలిక వసతులు కల్పించడంతో పాటుకొంత ఆర్థిక తోడ్పాటులో సహాయపడుతుందని తెలిపారు. అనంతరం రైతులే స్వయం సమృద్ధిగా ఎదిగేటట్లు చేస్తుందని తెలిపారు. రైతు ఉత్పత్తులు రైతులే అమ్ముకునే విధంగా కొనుగోలు సంస్థలతో నిర్వహిస్తామని అన్నారు. వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు నాబార్డ్ ద్వారా రాయితీలు బ్యాంకుల ద్వారా పొందే సౌకర్యం ఈ కేంద్రాలకు ఉంటుందని వివరించారు. బోర్డులో దాదాపు 300మందికిపైగా రైతులను సభ్యులుగా చేర్చుకోవటం, షేర్ క్యాపిటల్ కట్టించుకోవడం తప్పనిసరిని అన్నారు. బోర్డు సభ్యులు, రైతుల అనుమానాలను, ఎదురయ్యే సమస్యలను ప్రశ్నించగా సమాధానం తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ భార్గవ, బోర్డు ఎండి ఎం శ్రీనివాసబాబు, కార్యదర్శి గంట మంజుష, నార్నె శ్రీనివాసరావు, బాచిన శ్రీనివాసరావు, బాచిన వీరయ్య, కరి శివయ్య, గంట అనిల్, జాగర్లమూడి ప్రసాద్, రావి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️