అంతర్జాతీయ షాట్‌పుట్‌ పోటీలకు ఎంపిక

Feb 10,2024 23:56

ప్రజాశక్తి – చీరాల
ఎస్బీ విభాగంలో పనిచేస్తున్న సిహెచ్ నాగరాజు జాతీయస్థాయి షాట్ పుట్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక అయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన 5వ నేషనల్ మాస్టర్స్ అత్లెంటిక్‌ చాంపియన్‌షిప్ జాతీయ స్థాయి షాట్ పుట్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి 2వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆస్ట్రేలియాలో జరగబోవు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా అతనిని ఉన్నత అధికారులు, తోటి సిబ్బంది అభినందించారు.

➡️