67ఏళ్ల వయస్సులో మోకాళ్లపై శింగరకొండ దర్శనం

ప్రజాశక్తి – అద్దంకి
తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, శాసన సభ్యులు గొట్టిపాటి రవికుమార్ సాధారణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పట్టణంలోని నర్రావారిపాలెంకు చెందిన నర్రా కాంతయ్య 67ఏళ్ల వయస్సులో కూడా సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి స్వామిని మంగళవారం దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు చిన్ని శ్రీనివాసరావు, పట్టణ, గ్రామీణ ప్రాంత తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️