గిడ్డంగులు సందర్శించిన విద్యార్థులు

Feb 13,2024 01:02

ప్రజాశక్తి – బాపట్ల
రైతు పండించిన ధాన్యాన్ని గిడ్డంగుల్లో ఏ విధంగా నిలువ చేసుకోవాలనే అంశంపై వ్యవసాయ విద్యార్థులకు అవగాహనకు ఆహార సంస్థ గిడ్డంగులను సోమవారం సందర్శించినట్లు అసోసియేట్ ప్రొఫెసర్ కె సుశీల తెలిపారు. గిడ్డంగుల నిర్వహణ, ధాన్యం నిలువపై ఏపీ స్టేట్ వేర్ హౌస్ ఇన్‌చార్జ్ ఎల్‌సి .శ్రీనివాసరెడ్డి వివరించారు. ప్రభుత్వం రైతులకు అందించే పథకాలు, రాయతీలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిలబస్‌లో భాగంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం గిడ్డంగుల వద్దకు విద్యార్థులను తీసుకు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వి సీతారాంబాబు పాల్గొన్నారు.

➡️