ప్రజాశక్తి – బాపట్ల
దేశ సమైక్యతను పెంపొందించే జనగణ మన జాతీయ గీతాన్ని అందించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చిరస్మరణీయులని శ్రీ భావపురి విద్యా సంస్థల ప్రిన్సిపల్ ఆవుల వెంకటేశ్వర్లు అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 83వ వర్ధంతి సందర్భంగా భావపురి విద్యా సంస్థల ప్రాంగణంలో ఠాగూర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతి సమైక్యత, సమగ్రతకు జనగణమన జాతీయ గీతంతో తరతరాలకు తరగని సమైక్య భావాన్ని చాటిచెప్పిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. కార్యక్రమంలో గోన ప్రభాకరరావు, మరకతవల్లి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
