తెలుగు సినీ సాహితీ సిరి’వెన్నెల’

May 20,2024 23:11 ##bapatla #Sirivennela

ప్రజాశక్తి – బాపట్ల
తెలుగు సినీ సాహిత్య జగతిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి పున్నమి వెన్నెల కురిపించారని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి 69వ జయంతి సందర్భంగా సిరివెన్నెల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్భంగా నరసింహ వర్మ మాట్లాడుతూ సిరివెన్నెల 8 వందల పైచిలుకు సినిమాలకు 3వేల పాటలకు పైగా రచించారని అన్నారు. సిరివెన్నెల 11 నంది, 4 ఫిలిం ఫేర్ అవార్డులను అందుకున్నారని అన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి విధాత తలపున ప్రభవించినది, ఆది భిక్షువు వాడినేది కోరేది, జగమంత కుటుంబం నాది, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, బోటనీ పాఠముంది, ఈ వేళ్ళలో నీవు, బలపం పట్టి భామ బడిలో వంటి నవరసభరిత గీతాలు రచించారని అన్నారు. మర్రి మాల్యాద్రిరావు, మున్నం మస్తాన్‌రెడ్డి, కీర్తి వెంకయ్య, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామ చంద్రమూర్తి, కొమ్మూరి సీతారామాంజనేయులు పాల్గొన్నారు.

➡️