ప్రజాశక్తి – చీరాల
కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో దోషలను కఠినంగా శిక్షించాలని భారతీయ జీవిత బీమా ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కలకత్తా ఘటనకు నిరసనగా యూనియన్ ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం ఖండిస్తూ మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు అరికట్టాలని కోరారు. వివిధ ఘటనల్లో దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఎల్ఐసి మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఏజెంట్ మిత్రులు, ఇతర మహిళా సంఘాల నేతలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఐసిఇయు జిల్లా సెక్రటరీ ఆర్‌విఎస్ రామిరెడ్డి,
బ్రాంచి సెక్రటరీ టి విజయకుమార్, బ్రాంచి ప్రెసిడెంట్ సిహెచ్ హరిప్రసాద్, మహిళా ఉద్యోగులు, ఏజెంట్ మిత్రులు పాల్గొన్నారు.
