అదుపుతప్పి టాక్టర్ కాల్వలో బోల్తా

May 25,2024 00:26 ##repalle #Accident

ప్రజాశక్తి – రేపల్లె
ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలో బోల్తా పడిన ఘటన శుక్రవారం మండలంలోని కామరాజుగడ్డలో చోటు చేసుకుంది. ప్రమాదంలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న కొల్లిపర మండలం దావులూరుపాలెం నుండి నగరం మండలం ధూళిపూడి పంచాయతీ ఉయ్యూరు వారిపాలెంలో కొలుపులు కోసం వచ్చినట్లు చెప్పారు. కొలుపుల అనంతరం మండలంలోని దక్షిణకాశీగా పేరుగాంచిన మోర్తట శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని కృష్ణా నది స్నానానికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి తిరగబడింది. ట్రాక్టర్లో 30మంది ఉండగా వారిలో 10మందికి తీవ్ర గాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

➡️