క్రీడాకారునికి దగ్గుమళ్ళ ఆపన్న హస్తం

Feb 10,2024 23:53

ప్రజాశక్తి – చీరాల
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం అందుకున్న క్రీడాకారుడు దేవరకొండ ప్రేమసాగర్‌కు అరుదైన అవకాశం దక్కింది. రాధే గ్రూప్ కనస్ట్రక్షన్స్‌ ఆపన్న హస్తం అందించారు. గ్రూప్ చైర్మన్ దగ్గుమళ్ల ప్రసాదరావు, మేనేజింగ్ డైరెక్టర్ రాధే క్రీడాకారుడు ప్రేమసాగర్‌కు ఐదేళ్లపాటు స్పాన్సర్ షిప్ అందిస్తు అగ్రిమెంట్ చేసుకున్నట్లు ప్రేమసాగర్ తండ్రి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రేమసాగర్‌కు అవసరమైన స్పోర్ట్స్ పరికరాల కొనుగోలు, ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు, విదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ప్రయాణ, భోజన, వసతి ఖర్చులు ఏడాదికి రూ.5లక్షల చొప్పున ఐదేళ్లకు రూ.30లక్షల వరకు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారునికి అరుదైన అవకాశం రావడంతో కోస్తా గిరిజన అభివృద్ధి సంస్థ డైరెక్టర్ దేవరకొండ ప్రవీణ్ కుమార్, సెక్రటరి మల్లి అజయ్ బాబు, గిరిజన విద్యార్థి రాష్ట్ర చైర్మన్, ప్రొఫెసర్ మల్లి భాస్కర్, ఎపి గిరిజన ఎంప్లాయిస్ అసోసియేషన్ రైల్వే మల్లి భాస్కరరావు కృతజ్ఞతలు తెలిపారు.

➡️