మిడ్‌డేమీల్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Jul 16,2024 00:55 ##Addanki #MidDayMeels

ప్రజాశక్తి – అద్దంకి
మధ్యాహ్నం భోజన (మి డ్డె మీల్స్) కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో ఎంఇఒ సుధాకర్‌ను సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మిడ్‌డే మీల్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోటేశ్వరమ్మ మాట్లాడుతూ మండలంలో పనిచేస్తున్న కొందరు మధ్యాహ్నం భోజనం కార్మికులపైన రాజకీయ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. విధుల నుండి తొలగిపోవాలని బెదిరిస్తున్నారని తెలిపారు. కార్మికులకు గత వేసవి సెలవులకు ముందు ఏప్రిల్ నెల మెనూ చార్జీ బిల్స్‌తోపాటు రెండు నెలల వేతనం పెండింగ్ ఉందని తెలిపారు. వెంటనే బకాయిలు మంజూరు చేయాలని కోరారు. ప్రతి నెలా వేతనం, మెనూ బిల్లులు ఇవ్వాలని, కార్మికులకు నెలకొక గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలని, కార్మిక పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు. మిడ్‌డే మిల్స్ కార్మికులు అక్కమ్మ, చిన్నమ్మాయి, గురుమూర్తి పాల్గొన్నారు.

➡️