బీసీల మద్దతుతోనే టిడిపి కూటమి విజయం

Jun 8,2024 23:32 ##Bapatla #bc

ప్రజాశక్తి – బాపట్ల
బీసీలు పూర్తిస్థాయి మద్దతుతోనే టిడిపి కూటమి ఊహించని విజయం సాధించిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్ పేర్కొన్నారు. న్యాయవాది అంగలకుదురు నటరాజన్ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ సంఘం టిడిపి కూటమి అభ్యర్థులకు పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. గ్రామస్థాయి వరకు తమ సంఘం పనిచేయడంతో టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారని అన్నారు. నాలుగుసార్లు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పరాజయం పాలైన టిడిపికి ఈసారి బిసిల మద్దతుతో వేగేశన నరేంద్ర వర్మకు విజయం అందించినట్లు తెలిపారు. ఈసందర్భంగా రామోజీరావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని సంతాపం తెలిపారు. సమావేశంలో బీసీ సంఘం నాయకులు ఎన్ఎస్‌పి రాజు, మారం రవికుమార్, న్యాయవాది అగలకుదురు నటరాజన్, ఉప్పలదిన్నె గోపీనాథ్ పాల్గొన్నారు.

➡️