టిడిపి నేతల దైవదర్శనం

ప్రజాశక్తి – భట్టిప్రోలు
రాష్ట్రంలో టిడిపి గెలుపొందటమే కాక వేమూరు ఎంఎల్‌ఎగా నక్క ఆనందబాబు విజయం సాధించాలని కోరుతూ ఎన్నికల ముందు చేసుకున్న మొక్కులను ఎన్నికల అనంతరం ఆదివారం వివిధ గ్రామాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు తీర్చుకున్నారు. అద్దేపల్లి గ్రామానికి చెందిన టిడిపి నాయకులు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం విశ్వనాధపల్లికి వెళ్లి సంబరాలు జరుపుకున్నారు. నాంచారమ్మ గుడిలో మొక్కలు తీర్చుకున్నారు. ఫైలవరం గ్రామంలో టిడిపి ఆధ్వర్యంలో గ్రామ దేవత జొన్నాదుల రేడంకమ్మ, పైడమ్మ దేవస్థానంలో ముక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎడ్ల జయశీలరావు, కంభం సుధీర్, వారి మిత్ర బృందం, మాచర్ల నాగరాజు, దీపాల ప్రసాదు, బూదాటి నాంచారయ్య పాల్గొన్నారు.


కొల్లూరు : ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి 164సీట్లుతో విజయబేరి మోగించిన సందర్భంగా మండలంలోని ఆంధ్ర ఇవాంజికల్ లూధరన్
చర్చ్, తెలుగు బాప్టిస్ట్ చర్చిలో 101 కొబ్బరికాయలు కొట్టి టిడిపి నాయకులు ఆదివారం తమ మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, గోరిగిపూడి ఏబేలు, కె రాద, కనపాల బాబురావు పాల్గొన్నారు.


పర్చూరు : వైసిపిగద్దె దిగాలని నవ్యాంధ్ర రూపకర్త చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, అభివృద్ధి ప్రదాత ఏలూరు సాంబశివరావు హ్యాట్రిక్ విజయం సాధించాలన్న కోరికలు తీరటంతో జాగర్లమూడి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు ధూళిపల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో మహిళలు పాదయాత్ర చేపట్టారు. ఆ గ్రామం నుంచి పాదయాత్రగా పర్చూరు వై జంక్షన్‌లోని అభయాంజనేయ స్వామి ఆలయానికి చేరుకొని 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రాన్ని వైసిపి నుంచి విముక్తి కలిగించాలన్న కోరిక తీరిన నేపథ్యంలో ముక్కు తీర్చుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కొల్లా శ్రీనివాసరావు, అడ్డగడ రామకృష్ణ, ఎడ్ల సాంబయ్య, కక్కెర వెంకట శివ, బుల్లెట్ శ్రీను, అడ్డగడ వెంకటేశ్వర్లు, షేక్ గౌస్, ఫేక్ బషీర్, హటాన్ బాజీ పాల్గొన్నారు. జాగర్లమూడికి చెందిన దివ్యాంగులు ట్రై సైకిల్‌పై వచ్చి అభయాంజనేయ స్వామిని దర్శించుకుని అభిమానాన్ని చాటుకున్నారు.


సంతమాగులూరు : సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడంతోపాటు అద్దంకి నియోజకవర్గం ఎంఎల్‌ఎగా గొట్టిపాటి రవికుమార్ భారీ మెజార్టీతో ఐదో సారి విజయం సాధించినందుకు మండలంలోని కుందుర్రు గ్రామానికి చెందిన టిడిపి జిల్లా కార్య నిర్వాహక ఉపాధ్యక్షురాలు నాగబోతు సుజాత ఆధ్వర్యంలో కుందుర్రు, పరిటాలవారి పాలెం గ్రామాల మహిళలు పెద్ద సంఖ్యలో కొమ్మాలపాడు మీదుగా 35కిలోమీటర్లు దూరంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దర్శనానికి కాలినడకన బయలుదేరి వెళ్లారు. స్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. మార్గమధ్యలో మహిళలకు టిడిపి సంతమాగులూరు నాయకులు అట్లా పెద వెంకటరెడ్డి తమ సంఘీభావం తెలిపి పండ్లు అందజేశారు.

➡️