విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలి

Apr 4,2024 00:26 ##Vemuru #tdpnews #Nakka

ప్రజాశక్తి – వేమూరు
చుండూరులోని మాజీ జీడీసీసీబీ డైరెక్టర్, టిడిపి సీనియర్ నాయకులు గుదేటి బ్రహ్మారెడ్డి విగ్రహాన్ని మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పంటించి దగ్ధం చేశారు. ఆ ప్రాంతాన్ని టిడిపి అభ్యర్థి, మాజీమంత్రి మక్కా ఆనందబాబు సందర్శించారు. బ్రహ్మారెడ్డి విగ్రహానికి నిప్పంటించిన దుండగులను తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కొల్లూరులో కులాల మధ్య చిచ్చు రేపటమే కాక భట్టిప్రోలు తహశీల్దారు కార్యాలయం వద్ద అధికారులను బెదిరించారని అన్నారు. ఓ విలేకరిపై దాడి చేసి సెల్ఫోన్ కూడా లాక్కున్న సంఘటనలు ఉన్నాయని అన్నారు. టిడిపికి మద్దతునిచ్చే ఎన్నారైలను కూడా విదేశాలకు వెళ్లకుండా చేస్తానని వైసిపి అభ్యర్థి వ్యాఖ్యానించటం పట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కులాల మద్య చిచ్చుపెట్టే కుట్రలు వైసిపి చేస్తుందని అన్నారు.

➡️