ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం

Dec 10,2023 23:26

ప్రజాశక్తి – చీరాల
దేవాంగులంతా ఐక్యంగా ఉంటేనే ఎలాంటి సమస్యలు ఎదురైన సులువుగా పరిష్కరించుకోవచ్చని టిడిపి నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని జాండ్రపేట హై స్కూల్ గ్రౌండ్‌లో బాపట్ల జిల్లా దేవంగ వనభోజన మహోత్సవం వైభవంగా ఆదివారం నిర్వహించారు. శ్రీ హంపి హేమ కోట శ్రీ గాయత్రి మహా సంస్థాన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ దయానందపురి మహా స్వామిజి హాజరయ్యారు. స్వామికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సజ్జా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పందిళ్ళపల్లి నుండి జాండ్రపేట వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. కార్తీక పురాణ ప్రవచనం, సత్కార మహోత్సవాలు, చిన్నారులకు ఆటలు, పాటలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.

➡️