ఎమ్మెల్యే గొట్టిపాటి పర్యటన

Feb 11,2024 22:18

ప్రజాశక్తి – పంగులూరు
మండలంలోని నూజిల్లపల్లిలో ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ ఆదివారం పర్యటించారు. గ్రామానికి చెందిన విప్పర్ల నాగేశ్వరరావు ఇటీవల మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామానికి చెందిన గంగా నాగమ్మ దశదినకర్మకు హాజరై చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన వెంట గొట్టిపాటి కాజాస్వామి, మాజీ జెడ్పిటిసి కర్రీ వెంకట సుబ్బారావు, మాజీ సర్పంచ్ గొట్టిపాటి అనంతలక్ష్మి, మద్దినేని అనిల్, శానం సుబ్బారావు, విప్పర్ల పోతురాజు పాల్గొన్నారు.

➡️