అభివృద్ది, సంక్షేమం చేసి చూపిస్తాం

Jun 10,2024 23:18 ##Panguluru #tdpnews

ప్రజాశక్తి – పంగులూరు
చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ది, సంక్షేమం చేసి చూపిస్తామని టిడిపి నాయకులు, మాజీ జెడ్‌పిటిసి కుక్కపల్లి ఏడుకొండలు అన్నారు. సినీ నటుడు, హిందూపురం ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను టిడిపి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. టిడిపి నాయకులు కేకును కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. సభకు టిడిపి మండల అధ్యక్షులు రావూరి రమేష్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రజలు టిడిపికి ఘన విజయాన్ని అందజేశారని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మంచి పాలన రాబోతుందని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును టిడిపి ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టిడిపి ఎప్పుడూ ముందుండి పనిచేస్తుందని అన్నారు. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్‌ను మరోసారి గెలిపిండం ద్వారా ఆయనను మంత్రిని చేసే అవకాశం ప్రజలు కల్పించారని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వంలో రవికుమార్ మంత్రి కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతవరకు అద్దంకి నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసిన వారెవరు లేరని అన్నారు. మొట్ట మొదటిసారిగా రవికుమార్ మంత్రి కాబోతున్నారని అన్నారు. ఈ విజయం ప్రజలందరిదని అన్నారు. ప్రజల కోసమే ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. మాజీ జెడ్పిటిసి కర్రీ వెంకటసుబ్బారావు, టిడిపి నాయకులు చిలుకూరి ప్రసాద్ నాయుడు, మాజీ సర్పంచ్ చింతల సహదేవుడు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మంగళూరు గ్రామ టిడిపి అధ్యక్షుడు బాచిన త్రివేణి బాబు, పంగులూరు నాయకులు చిలుకూరి ప్రసాద్ నాయుడు, నూజిల్లపల్లి నాయకుడు గొట్టిపాటి కాజాస్వామి, బైటమంజులూరు మాజీ సర్పంచ్ శివరాజు, బాచిన రత్నకుమార్, మాజీ సర్పంచ్ ఉన్నం రవి, బోరెడ్డి ఓబులురెడ్డి, జాగర్లమూడి సుబ్బారావు, అలవలపాడు సర్పంచ్ జకరయ్య, అల్లంనేని బ్రహ్మానంద స్వామి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

➡️