వైసీపీతోనే అందరికి సంక్షేమ ఫలాలు : ఆసరా సభలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి

Feb 10,2024 23:55

ప్రజాశక్తి – చీరాల
సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. మండలంలోని ఈపురుపాలెం బాలుర ఉన్నత పాఠశాల మైందనాంలో వైఎస్‌ఆర్‌ ఆసరా 4వ విడత సంబరాలు శనివారం ఘనంగా జరిగాయి. ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణ మూర్తి, వైసిపి ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా 4వ విడత 1565పొదుపు సంఘాలకు రు.13.69కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. జగన్‌ పేదల పక్షపాతి అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా, వెంకటేష్ బాబును ఎంఎల్‌ఎగా గెలిపించుకొని వైసీపీ జెండా ఎగురవేయాలని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు ఎంతగానో ఆకర్షించాయి. ఎపిఎం సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సభలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షులు ఆసాది అంకాలరెడ్డి, మల్లెల లలిత రాజశేఖర్, వైసిపి జిల్లా కార్యదర్శి బండారు శివపార్వతి, నల్లబోతుల రాజ్ కుమార్, బుర్ల సాంబశివరావు, పిఎసిఎస్‌ చైర్మన్ బోయిన కేశవులు, బిట్రా శ్రీనివాసరావు, మాజీ వైస్ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు, బుర్ల మురళీకృష్ణ, పృద్వి, విఒలు పాల్గొన్నారు.

➡️